ఈసారైనా త్రిష కోరిక నెరవేరుతుందా?




త్రిష ఇప్పుడు ఒకే ఒక్క విషయం మీద దృష్టిపెట్టింది. ఏది ఏమైనా తను విజయం సాధించాలి...అందుకోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమే. కావాలంటే, రెమ్యునేరేషన్ తగ్గించుకుంటుంది. సెట్లో గొంతెమ్మ కోరికలు ఏవీ కోరదు. ఇంతకీ అదేమిటంటే... బాలీవుడ్ లో తను సక్సెస్ సాధించాలి. ఒక్క హిట్ కొట్టాలక్కడ. దీని కోసమే త్రిష ఇప్పుడు తన ప్రయత్నాలన్నీ చేస్తోంది.
ఆమధ్య హిందీలో తను చేసిన తొలి చిత్రం 'కట్టా-మీటా' ఫ్లాప్ అయిన దగ్గర్నుంచీ త్రిషకు అసలు కుదురులేదనే చెప్పాలి. సన్నిహితుల దగ్గర ఎప్పుడూ బాలీవుడ్ గురించే మాట్లాడుతోందట. ఈమధ్య మళ్లీ తన ప్రయత్నాలు ముమ్మరం చేసి తాజాగా ఓ సినిమా పట్టింది. అందులో హీరో రణబీర్ కపూర్ అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం తన పారితోషికాన్ని కూడా తగ్గించుకుంటానని చెప్పిందట. మరి ఈసారైనా త్రిష కోరిక నెరవేరుతుందా?

0 comments:

Post a Comment