మీడియాపై మండిపడుతున్న అశ్వనీదత్
మొదటి నుంచీ తెలుగు సినిమా పత్రికలు బాకా పత్రికలన్న పేరు తెచ్చుకున్నాయి. ఓ సినిమా అట్టర్ ఫ్లాపయినా కూడా అదో సూపర్ హిట్ అంటూ రాస్తుంటాయి. ఫ్లాపయిన సినిమాని ఫ్లాపని రాయడానికి ధైర్యం చేయవు. దీనికి రకరకాల కారణాలున్నాయి. సినిమా పత్రికలన్నీ సంప్రదాయ పత్రికలు కావడం, ఆ పత్రికల యజమానులకు సినిమా వాళ్లతో సంబంధాలుండడం కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, ఒక్క 'సితార' పత్రికలో మాత్రం గుడిపూడి శ్రీహరి నిష్పాక్షికంగా రాసేవారు. ఓ సినిమా ఫ్లాపయితే ఫ్లాపని నిర్భయంగా రాసేవారు.
ఇదిలా ఉంచితే, ఇప్పుడు టీవీ న్యూస్ చానెళ్ళు, న్యూ మీడియా (వెబ్ సైట్లు) రాకతో సినిమా వాళ్ల పప్పులు ఉడకడం లేదు. ప్రతి దాన్నీ ట్రాన్స్ పరెంట్ గా చూపిస్తున్నాయి. ఇది సినిమా వాళ్లకి నచ్చడం లేదు. తాజాగా 'శక్తి' చిత్ర నిర్మాత అశ్వనీదత్ కి కూడా ఓ చానెల్ ప్రసారం చేసిన కథనం నచ్చలేదట. 'శక్తి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన విషయంపై NTV ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. దీనిని జీర్ణించుకోలేని చిత్ర నిర్మాత దత్తు మీడియాపై మండిపడుతూ.... ఎన్.టి.వీని సినిమా పరిశ్రమ బ్యాన్ చేయాలంటూ ఫిల్మ్ ఛాంబర్ కి కంప్లైంట్ చేశారట. మరి, చాంబర్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!
Labels:
Film News
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment