'100% లవ్' సినిమాకి 'ఆరెంజ్' పోలికలు!




'చిరుత' చిత్రంతో తెలుగుతెరకు హీరోగా పరిచయమై, 'మగథీర' సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు రాంచరణ్. అలాగే 'జోష్' చిత్రంతో హీరోగా పరిచయమైన చైతూ 'ఏ మాయ చేసావే' సినిమాతో సూపర్ హిట్ సాధించి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. వీళ్ళిద్దరికీ కూడా రెండో సినిమానే కెరీర్లో టర్నింగ్ పాయింట్ అయింది. విశేషమేమిటంటే, చరణ్ తన మూడో సినిమా 'ఆరెంజ్' ఆడియో రిలీజ్ కార్యక్రమానికి హాజరు కాలేదు. అలాగే, చైతన్య కూడా తన మూడో చిత్రం '100% లవ్' ఆడియో ఫంక్షన్ కి హాజరు కావడం లేదు. ఇవన్నీ యాదృచ్చికమే అయినా సినిమా రంగంలో సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి, టాలీవుడ్ లో ఇప్పుడీ '100 % లవ్' సినిమాని 'ఆరెంజ్' సినిమాతో పోల్చుతూ జోకులు వేస్తున్నారు!

0 comments:

Post a Comment