‘తీన్‌మార్’అలా తీస్తే ఒక్కరోజు కూడా ఆడదు
‘తీన్‌మార్’అనే టైటిల్ పెట్టడానికి చాలా ఆలోచించాల్సొచ్చింది.తర్జనభర్జన జరిగాక చివరికి నేనే టైటిల్ సూచించాను. అందరికీ నచ్చింది. అలాగే హిందీ వెర్షన్‌లో ఉన్న కథను అలానే తీస్తే ఇక్కడ ఒక్కరోజు కూడా ఆడదు. అందువల్ల మూలకథను అలానే ఉంచి కథనపరంగా మార్పులు చేశాం అంటున్నారు జయంత్ సి.పరాంన్జీ.మొన్న గురువారం తీన్ మార్ చిత్రం అంతటా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే హీరోకి తగ్గట్టు డాన్సులు, ఫైట్స్, డైలాగులు అన్నీ సమకూర్చాం. ఏ దర్శకుడయినా రీమేకులు ఎప్పుడూ ఉన్నదున్నట్టుగా తీయకూడదు. స్థానిక సంస్కృతికి తగ్గట్టు మలుచుకోవాలి అన్నారు.అంతేగాక ప్రేమకథలు నా వీక్‌నెస్ అందుకనే అంత బాగా తీసాను అంటున్నారు
Labels:
Film News
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment