పవన్ ఫ్యాన్స్ అందరూ నా ఇంటిమీదకొస్తారని భయంతో
'లవ్ఆజ్‌కల్' రిమేక్ కావాలని కళ్యాణ్ అడగ్గానే గుడ్ చాయిస్ అనుకున్నాను. కాని మక్కికి మక్కి దింపితే గొడవలైపోతాయన్నాను. అబ్బే...ఏం కాదన్నాడు. 'నీకేంటి నాయనా...నీకు ఇంటి ముందు సెక్యూరిటీ ఉంటారు. నాకలా కాదు. మా హీరోని ఇలా చూపించావేమిటని నీ ఫ్యాన్స్ అందరూ నా ఇంటిమీదకొస్తారు' అని అన్నాను. సైఫలీఖాన్ పెద్ద క్రేజ్ ఉన్న హీరో కాదు. ఎలా చూపించినా అక్కడి ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. కాని కళ్యాణ్‌ని అలా చూపిస్తే ఒప్పుకోరు. దాంతో కథకి కొన్ని కొత్త రంగులద్దాం. లవ్ఆజ్‌కల్‌లో రిషీకపూర్ చేసిన పాత్ర కూడా కళ్యాణ్‌తో చేయిస్తే ప్రేక్షకులకి కావలసిన మాస్ ఎలిమెంట్స్ చూపించే అవకాశముంటుందని అనుకున్నాను. డబుల్ యాక్షన్‌కి కళ్యాణ్ ఓకే చెప్పారు అంటూ తీన్ మార్ విశేషాల్ని మీడియాతో పంచుకున్నారు దర్శకుడు జయంత్.
Labels:
Film News
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment